బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్. కేసిఅర్ మలి విడత ఉద్యమంలో ఆమరణ నిరహార దీక్ష పూనడంతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందన్నారు.కెసిఅర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలందరం ఉద్యమించి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించుకున్నాం అన్నారు.
సాధించుకున్న తెలంగాణా రాష్ట్రాన్ని 9 ఏళ్ల కాలంలో అభివృద్ధిలో, సంక్షేమంలో భారత దేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన నాయకుడు కేసిఅర్ అన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్, బిజెపి పార్టీలకు కనపడడం లేదా ఈ విషయంలో చర్చకు నేను సిద్ధం అన్నారు.ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారు అన్నారు. మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పదవులు అనుభవించి ఇప్పుడు వెళ్లిపోయి కేసిఅర్ కు వెన్నుపోటు పొడిచిన కొడుకులను తిరిగి పార్టీలోకి తీసుకోవద్దు అన్నారు.
Also Read:లగచర్ల భూసేకరణ వెనక్కి..ప్రభుత్వ నిర్ణయం