గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకుంది.
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఓటిటి రిలీజ్ తర్వాత టెలివిజన్ టెలికాస్ట్ కి కూడా వచ్చింది.గేమ్ ఛేంజర్ మొదటి టెలికాస్ట్ లో 5.02 టీఆర్పీ రేటింగ్ పాయింట్స్ ని అందుకున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. సలార్, కల్కి 2898 ఎడి చిత్రాలతో పోటీపడి బుల్లితెరపై ఈ రేటింగ్ సాధించడం విశేషం.
Also Read:Health Tips:కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే?

