గేమ్ ఛేంజర్..ట్రీట్ రెడీ!

17
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’. ఆర్.ఆర్.ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘గేమ్‌ ఛేంజర్‌’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్‌గా నటిస్తుండగా గేమ్ ఛేంజర్ నుండి ఎప్పుడెప్పుడు అప్‌డేట్ వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రీసెంట్‌గా వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకోగా ఈ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా సినిమా నుండి సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే సినిమా నుండి జరగండి సాంగ్ ని చరణ్ బర్త్ డే కానుకగా లాంచ్ చేస్తున్నట్టుగా ప్రకటించగా ఇందుకు సంబంధించిన పోస్టర్‌ని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు బ్యానర్‌లో తెరకెక్కుతున్న 50వ చిత్రమిది.

Also Read:Modi:రష్యాకు అండగా ఉంటాం

- Advertisement -