RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై జీ స్టూడియోస్ అసోసియేషన్‌లో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని అన్‌కాంప్రమైజ్డ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఇవాళ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా జరగండి పాట రిలీజ్ అయింది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ సంగీత సారథ్యం అందిస్తోండగా 150 థియేటర్స్‌లో ఈ పాటను ప్రత్యేకంగా ప్రదర్శించారు.
రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తిరుణ్ణావుకరుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగు,తమిళ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నారు.
Also Read:BJP:బీజేపీ ‘మైండ్ గేమ్’?