గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. ఎన్నో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ చిత్రాలను రూపొందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ ఈ మూవీని నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ అన్ కాంప్రమైజ్డ్‌గా అంచనాలకు ధీటుగా గేమ్ చేంజర్‌ను నిర్మిస్తున్నారు. RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత రామ్ చరణ్ చేస్తోన్న సినిమా కావటంతో గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
సౌత్ ఇండియన్ సినిమా రేంజ్‌ను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లిన సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ మేకింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన సినిమాలను మించేలా ‘గేమ్ ఛేంజర్’ను ఆయన రూపొందిస్తున్నారు. లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్‌తో చరణ్‌ను ప్రెజెంట్ చేస్తున్నారు శంకర్. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో దసరా సందర్భంగా మేకర్స్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు సంబంధించి సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీంతో పాటు మరో అమేజింగ్ అప్‌డేట్‌ను అందించారు. దీపావళి సందర్బంగా ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి తొలి సాంగ్‌ను విడుదల చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌లతో పాటు మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ కలిసి తొలిసారి వర్క్ చేస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా నుంచి పాటను పాన్ ఇండియా రేంజ్‌లో దీపావళికి గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నామని చిత్ర యూనిట్ తెలియజేసింది.
Also Read:కళ్ళ కింద నల్ల మచ్చలు తగ్గించండిలా!