టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గౌతమ్ గంభీర్ మైదానంలో ఎంత దూకుడుగా వ్యవహరిస్తారో, వ్యక్తిగా తాను చేసే పనుల్లో ఎప్పుడూ ఓ మెట్టు ఎదుగుతుంటారు. గతంలో ఛత్తీస్ గఢ్‌లో మావోల దాడిని ఖండిస్తూ ప్రతీకారం తీర్చుకోవాలని జవాన్లకు సూచిస్తూ ట్వీట్ చేసిన సుక్మా ఉగ్రదాడిలో మృతిచెందిన సీఆర్‌పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు అందజేసిన విషయం తెలిసిందే. తాజాగా జమ్మూలో ఉగ్రదాడిలో మృతిచెందిన అధికారి అబ్దుల్ రషీద్ కూతురు జోహ్రా ఫోటోనూ షేర్ చేస్తు మనస్సుకు హత్తుకునే కామెంట పోస్ట్ చేశారు.
జోహ్రా, జోలపాట పాడి నేను నిన్ను నిద్రపుచ్చలేను. కానీ నువ్వు నీ జీవిత లక్ష్యాలను సాధించుకునేందుకు మాత్రం చేతనైన సాయం చేయగలను. నీ చదువు బాధ్యతలను జీవితాంతం చూసుకుంటానని’ గంభీర్ ఓ ట్వీట్లో రాసుకొచ్చారు. నీ కన్నీటి బొట్టును నేలకు రాలనివ్వకు. నీ కన్నీటిబొట్టు తాకగానే భూమాత గుండె బరువెక్కుతోంది. ఉగ్రవాదులతో పోరాడి అమరుడైన నీ తండ్రి అబ్దుల్ రషీద్‌కు ఇదే నా సెల్యూట్’ అంటూ అందరిని కదిలించే విధంగా ట్విట్ చేశారు గంభీర్.
2002లో నమోదైన రెండు రేప్ కేసుల్లో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ కు 20 సంవత్సరాల జైలు శిక్షపడిన విషయం తెలిసిందే. గుర్మీత్ అత్యాచార కేసుపై సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును మహిళా విజయంగా అభివర్ణించాడు.
Zohra,plz don't let those tears fall as i doubt even Mother Earth can take d weight of ur pain. Salutes to ur martyred dad ASI,Abdul Rashid. pic.twitter.com/rHTIH1XbLS
— Gautam Gambhir (@GautamGambhir) September 5, 2017