సినీ నటుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ మధ్య ట్విట్టర్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి గల్ల జయదేవ్ తనదైన రీతిలో ట్విట్టర్‌ను వేదికగా చేసుకుని పవన్‌పై విమర్శలు చేశారు.
గతంలో పవన్ కల్యాణ్ తల్లిపై రాంగోపాల్ వర్మ సారధ్యంలో శ్రీరెడ్డి ఆరోపణలు చేయడం. ఆయన హుటాహుటినా ఫిలీంఛాంబర్‌కు వెళ్లడం వంటివి జరిగాయి. దీంతో పవన్ కల్యాణ్ కొన్ని మీడియా ఛానళ్లపై విమర్శలు కూడా చేశారు. దీంతో పనన్ అభిమానులు అక్కడక్క కొన్ని మీడియా వాహనాలను ధ్వంసం చేసిన ఘటనలు కూడా చూశాం. ఈ నేపధ్యంలో గల్లా జయదేవ్ ట్విట్టర్‌లో అతని అభిమానుల తీరు పట్ల ఓ ట్విట్ చేశాడు.
పవన్ కల్యాణ్ గారూ… మీపై వ్యక్తిగత విమర్శల దాడి జరిగిందని ఆరోపిస్తూ, మీరు మీడియాపై గొంతెత్తి దాడికి దిగారు. కానీ..మీ అభిమానులు కూడా ఇతరుల పట్ల వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. వాడకూడని బాషను వాడుతున్నారని అన్నారు. శరీరాకృతిపై మాట్లాడుతూ కుటుంబ సభ్యులను ప్రస్తావిస్తున్నారన్నారు. ఈ విషయంలో పట్ల మీరు మౌనంగా ఉండటమనేది దీనికి అంగీకరిస్తూ, ప్రోత్సహిస్తున్నట్టుగా అనిపిస్తోంది” అని వ్యాఖ్యానించారు.
PK Garu, while you attack the media for practices that have offended you personally, your followers are making personal remarks, body-shaming, using foul language, attacking family and inciting violence. Your silence on this is tacit approval and encouragement. @PawanKalyan
— Jay Galla (@JayGalla) May 3, 2018