నా అస్తుల విషయంలో ఈడీ జాప్యం చేస్తోంది..

255
- Advertisement -

సోమవారం ఈడీ ఎదుట గాలి జనార్ధన్ రెడ్డి హాజరయ్యారు. ఈడీ అధికారుల విచారణ ముగిసిన తర్వాత గాలి జనార్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో రూ. 1000 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్టుగా ఆయన చెప్పారు. ఈ విషయమై తాను కోర్టును ఆశ్రయించనున్నట్టుగా ఆయన ప్రకటించారు. అయితే ఈ విషయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదని జనార్దన్‌ రెడ్డి చెప్పారు.

Gali Janardhan Reddy

ఓఎంసీ కేసులో ఈడీ జప్తు చేసిన అస్తులను విడుదల చేయాలని జనార్దన్ రెడ్డి కోరారు.నా ఆస్తులను విడుదల చెయ్యడంలో ఈడీ జాప్యం చేస్తోందన్నారు. అయితే ఈడీ అభ్యంతరాలపై వివరణ ఇచ్చిన గాలి.. సుప్రీంకోర్టు ఆదేశాలను వెంటనే అమలు చేయాలన్నారు. లేని పక్షంలో న్యాయం కోసం మరోసారి సుప్రీమ్‌ను ఆశ్రయిస్తామన్నారు.

ఓబుళాపురం మైనింగ్ వ్యవహారంలో నమోదు అయిన అన్ని కేసులను కర్ణాటక హైకోర్టు కొట్టేసింది. ఇక ఈడీ జప్తు చేసిన ఆస్తులను గాలి జనార్ధన్ రెడ్డికి విడుదల చేయాలని కర్ణాటక హై కోర్ట్ తీర్పు ఇచ్చింది. ఈడీ కర్ణాటక హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీమ్ కోర్టును ఆశ్రయించింది. అక్కడ హై కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించిన సుప్రీమ్ కోర్టు..ఈడీ ఎప్పిలేట్ అథారిటీని తప్పు పట్టింది.వెంటనే జప్తు చేసిన గాలి ఆస్తులను విడుదల చెయ్యాలని ఈడీకి సప్రీమ్‌ ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -