- Advertisement -
తెలంగాణ రాష్ట్రంపై ప్రశంసలు గుప్పించారు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్. వందశాతం ఫంక్షనల్ ట్యాప్ కనెక్షన్ రాష్ట్రంగా తెలంగాణ నిలవడంపై అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన షెకావత్…. ఇప్పటివరకు వంద శాతం ఎఫ్‌హెచ్‌టీసీ పూర్తి చేసిన రాష్ట్రాలుగా గోవా, తెలంగాణ నిలిచాయన్నారు. హర్ ఘర్ జల్ అనే తమ ఆలోచన త్వరలోనే నిజమవుతుందని కేంద్ర మంత్రి అన్నారు. మొత్తం 54,06,070 గృహాలకు ట్యాప్ కనెక్షన్ ద్వారా నీటి సరఫరా జరుగుతోందన్నారు. భారతదేశ గ్రామీణ గృహాలకు నీటి కనెక్షన్లు ఉండేలా చూడడానికి తాము దగ్గరగా ఉన్నామన్నారు.
- Advertisement -