గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న గద్వాల్ ఎమ్మెల్యే..

901
MLA Krishna Mohan Reddy
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గద్వాల్ లోని తన నివాసంలో మొక్కలు నాటారు గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. అనంతరం మాట్లాడుతూ ఎంపి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను హరిత యజ్ఞం రూపంలో మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను దేశ వ్యాప్తంగా విస్తరింపజేసి ఎంపి సంతోష్ కుమార్ గారు ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ గద్వాల్ లోని తన నివాసంలో కుటుంబంతో కలిసి మొక్కలు నాటిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా తమ ప్రాంతాన్ని పచ్చదనంతో నింపుతామని తెలుపుతూ షోషల్ వేదిక ద్వారా మరో ముగ్గురికి ఇండియా ఛాలెంజ్ విసురుతూ వారు కూడా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.

- Advertisement -