కొత్త రెవెన్యూ చట్టం..రైతుల భారీ ర్యాలీ

143
mla bandla krishnamohan

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తుండగా తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 500 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కృష్ణమోహన్ రెడ్డి …నూతన రెవెన్యూ చట్టం అద్భుతమని, దేశానికే ఆదర్శమన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లయినా పాత కాలం రెవెన్యూ చట్టాలతో గత ప్రభుత్వాలు కాలయాపన చేసి రైతులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశాయన్నారు. నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ గట్టు, ధరూర్‌, గద్వాల, మల్దకల్‌, కేటిదొడ్డి మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు.