8 వారాల గడువు ఇవ్వండి:స్పీకర్

5
- Advertisement -

ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టును మరో 8 వారలు గడువు కోరారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. సుప్రీంకోర్టు విధించిన 3 నెలల గడువులో కేవలం నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలను మాత్రమే విచారించారు స్పీకర్.

మరో ఆరుగురు ఎమ్మెల్యేలను విచారించడానికి 8 వారలు గడువు కోరారు స్పీకర్. సుప్రీంకోర్టులో ఇంకా స్పీకర్ పిటిషన్ అడ్మిట్ అవ్వలేదు. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం తుంగలో తొక్కి, 3 నెలల సమయం వృథా చేశారని ఆరోపించింది బీఆర్ఎస్ పార్టీ.

దానం నాగేందర్, కడియం శ్రీహరిలను విచారించకుండా కావాలని సాకులు చెప్తున్నారని.. అదనపు గడువు ఇవ్వకుండా, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ వేసింది బీఆర్ఎస్ పార్టీ.

Also Read:BB9:కెప్టెన్‌గా దివ్య

- Advertisement -