రివ్యూ : గద్దలకొండ గణేష్

1617
valmiki movie review
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్‌ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గద్దలకొండ గణేష్’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించగా వరుణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. సినిమా విడుదలకు ఒకరోజు ముందు వాల్మీకి కాస్త గద్దలకొండ గణేష్ గా మారింది. మరి గద్దలకొండ గణేష్ గా వరుణ్ ఆకట్టుకున్నాడా…?పవన్‌కు గబ్బర్ సింగ్‌లాంటి హిట్ ఇచ్చిన హరీష్‌……వరుణ్‌కు అలాంటి హిట్టే ఇచ్చాడా లేదా చూద్దాం…

కథ :

అభి (అథర్వ) దర్శకుడు కావాలని కలలు కంటుంటాడు. దర్శకుడు అవ్వాలంటే ఒక గ్యాంగ్ స్టర్ కథ కావాలని నిర్మాత కోరడంతో నిజ జీవితంలో గ్యాంగ్ స్టర్ అయిన గద్దలకొండ గణేష్ (వరుణ్ తేజ్)ను దగ్గరుండి పరిశీలించి తన కథే రాస్తాడు. ఈ క్రమంలో అభి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు..? గణేశ్…గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు…?చివరకు సినిమా తీసి దర్శకుడిగా మారాడా…?అన్నదే గద్దలకొండ గణేశ్‌ కథ.

Image result for review gaddalakonda ganesh

ప్లస్ పాయింట్స్‌ :

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ వరుణ్ తేజ్ నటన,సంగీతం,డైలాగ్స్‌. సినిమా మొత్తం వన్‌ మ్యాన్‌ షోగా నడిపించాడు వరుణ్‌. తన కెరీర్‌లోనే బెస్ట్ రోల్ చేసిన వరుణ్….గద్దలకొండ గణేశ్‌ పాత్రలో ఒదిగిపోయాడు. మాటలు,డైలాగ్ డెలివరీ సూపర్బ్. సినిమాకు తనఅందంతో మరింత గ్లామర్ తెచ్చింది పూజా హెగ్డే. మిగితా నటీనటుల్లో అధర్వ ,మృణాళిని,బ్రహ్మాజీ ,సత్య ,తనికెళ్ళ భరణి వందశాతం న్యాయం చేశారు. ఎల్లువొచ్చి గోదారమ్మ పాట ప్రేక్షకుల చేత విజిల్స్ వేయిస్తుంది.

మైనస్ పాయింట్స్ :

సినిబాలో మేజర్ మైనస్ పాయింట్స్ సెకండాఫ్. రిజినల్ లో లేని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను తెలుగులో యాడ్ చేయగా అది అంతగా సెట్ కాలేదు.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. దర్శకుడు హరీష్ శంకర్ తనమార్క్‌ను స్పష్టంగా చూపించాడు. తనదైన డైలాగ్స్ తో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఇక సినిమాకు మరో హైలెట్ సంగీతం. ఇప్పటిదాకా తన కెరీర్ లో క్లాస్ ఆల్బమ్స్ అందించిన మిక్కీ తొలిసారి మాస్ సినిమాకి పనిచేశాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఆకట్టుకున్నాడు. సినిమాటోగ్రఫీ సూపర్బ్. ఎడిటింగ్ బాగుంది. 14 రీల్స్ నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

Image result for review gaddalakonda ganesh

తీర్పు:

మలయాళ మూవీ జిగర్తాండకు రీమేక్‌గా తెరకెక్కిన చిత్రం గద్దలకొండ గణేశ్‌. ఫస్ట్ హాఫ్ అంతా చాలా రేసీగా సాగిపోతుంది. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ బ్లాక్ లు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయి. వరుణ్ నటన,పూజా హెగ్డే గ్లామర్‌ సినిమాకు మరింత ప్లస్‌ కాగా సెకండాఫ్ కాస్త నిరాశ పరుస్తుంది. మొత్తంగా ఈ వీకెండ్‌లో అందరూ చూడదగ్గ చిత్రం గద్దలకొండ గణేష్.

విడుదల తేదీ:20/09/2019
రేటింగ్ : 3/5
నటీనటులు: వరుణ్ తేజ్,పూజా హెగ్దే,అతర్వా,మిర్నాలిని రవి
సంగీతం: మిక్కీ జే మేయర్
నిర్మాణం: 14 రీల్స్ ప్లస్
దర్శకత్వం: హరీష్ శంకర్

- Advertisement -