రేవంత్‌ను ఉరి తీయాలి:కిషోర్

7
- Advertisement -

ఏమన్నా అంటే కేసీఆర్‌ని ఊరి తీయాలి అంటాడు ఆయనను కాదు నిన్ను ఊరి తీయాలి రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్. మీడియాతో మాట్లాడిన రేవంత్.. ఎన్నికలు వస్తున్నాయంటే కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు… గోదావరి జలాలు తెచ్చుడు అంత ఈజీ అనుకుంటున్నావా అని రేవంత్ రెడ్డి అంటున్నాడు.. మరి మేము తీసుకు వచ్చాం కదా అన్నారు.

అవును గోదావరి జలాలు తెచ్చుడు ఓటుకు నోటు కేసులో సూట్కేస్ మోసినంత కష్టం అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి క్లబ్బులకు పబ్బులకు రాను అని సుద్దపూస లెక్క మాట్లాడుతున్నాడు… అసలు నీ బతుకు మొదలైందే జూబ్లీహిల్స్ క్లబ్ నుండి కదా రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read:కార్తికేయ స్వామిగా తారక్!

జూబ్లీహిల్స్ సొసైటీల ఫ్లాట్ తీసుకోని పక్కన ఫ్లాట్ ఓనర్లను బ్లాక్ మెయిల్ చేసి బతికినోడివే కదా రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి 6 ఫీట్లు ఉన్నా, అమితాబ్ బచ్చన్ అనుకుంటున్నాడు… 3 ఫీట్లు ఉన్నా కూడా నీకు 30 ఫీట్లు దించుతున్నాడు కదా సరిపోలేదా? అన్నారు. జగదీష్ రెడ్డికి భయపడే అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయించినావు కదా రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డిలాగా నీచంగా మాట్లాడటానికి నాకు సంస్కారం అడ్డొస్తుంది.. నల్గొండకు గత ఐదేళ్లుగా అద్భుతంగా లక్షల ఎకరాల్లో పంటలకు నీళ్లందించింది కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వర జలాలకు పట్టిన లక్ష హారతులు అందుకు సాక్ష్యం అన్నారు. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి సాక్షిగా చెబుతున్నాను…నీకు చేతకాకపోతే చెప్పు రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారి చేతికి పగ్గాలు అప్పగిస్తే, మూడు రోజుల్లో కాళేశ్వరం జలాలను రైతులకు అందిస్తాం అన్నారు.

- Advertisement -