Gadari Kishore:రేవంత్‌పై గాదరి కిశోర్ ఫైర్

22
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేత గాదరి కిశోర్. రాహుల్ గాంధీ పార్ల‌మెంట్‌లో మాట్లాడుతూ.. నీట్ ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. మ‌రి ఆయ‌న నీట్ ర‌ద్దు గురించి మాట్లాడినందుకు రాహుల్‌ను కూడా ఆమ‌ర‌ణ దీక్ష చేయ‌మ‌ని చెబుతున్నావా..? అని ప్రశ్నించారు.

తెలంగాణ ఉద్య‌మంలో అనేక‌ ఉద్య‌మాలు, దీక్ష‌లు చేశాం. వంద‌ల కేసులు మాపై పెట్టారు.. జైళ్ల‌కు పోయాం. అప్పుడు ఎక్క‌డున్నావ్ రేవంత్..? చంద్ర‌బాబు సంక నాకుతున్న‌వ్ అని ఎద్దేవా చేశారు. తుపాకీ ప‌ట్టుకుని తెలంగాణ వ‌ద్దు స‌మైక్యాంధ్ర కావాల‌ని తిరిగావు..ఇవాళ ఉద్య‌మ నాయ‌కుల‌ను, నిరుద్యోగుల‌ను అవ‌మానిస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్ర‌జ‌లు, నిరుద్యోగుల డిమాండ్లు నిజాయితీగా ఉన్నాయా..? లేదా అనేది ఆలోచించాలి. రేవంత్ శాడిస్టులాగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున నిరుద్యోగులు నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తుంటే ప్ర‌జా గొంతుక‌లు మూగ‌బోయాయి. కోదండ‌రాం ఎక్క‌డ పోయిండు చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read:కాంగ్రెస్ వ్యూహకర్తపై వీహెచ్‌ సంచలన కామెంట్స్

- Advertisement -