G20:నోరు పారేసుకున్న చైనా..కౌంటర్‌ ఇచ్చిన భారత్‌

56
- Advertisement -

భారతదేశం అతిధ్యమిస్తున్న జీ20 సమావేశాల్లో భాగంగా జమ్ముకాశ్మీర్‌లో జరిగే టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు చైనా బహిష్కరిస్తున్నట్టు చైనా విదేశాంగ శాఖ కార్యదర్శి వాంగ్ వెన్బిన్ తెలిపారు. జమ్ముకాశ్మీర్ వివాదాస్పద ప్రాంతమని అక్కడ జరిగే సమావేశాలకు తాము హాజరుకాబోమని చైనా తెలిపింది. అయితే చైనా వాదనలకు ఇండియా కౌంటర్ ఇచ్చింది. స్వంత భూభాగంలో మీటీంగులు నిర్వహించుకుంటామని ఇండియా తెలిపింది.

Also Read: MODI:విశ్వ శాంతి స్థాపకుడు మన గాంధీ

శ్రీనగర్‌లో మే 22 నుంచి 24 వరకు జరిగే మూడవ టూరిజం వర్కింగ్‌ గ్రూప్ సమావేశాలు జరగనున్నాయి. జీ20 దేశాలకు చెందిన సుమారు 60మంది ప్రతినిధులు శ్రీనగర్‌కు రానున్నారు. సదస్సు ముగిసేదాకా శ్రీనగర్‌ నగరాన్ని నో డ్రోన్‌ జోనుగా ప్రకటిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సదస్సుకు వచ్చే విదేశీ ప్రతినిధులు తిరుగాడే మార్గాలను అందంగా అలంకరించారు. అనుమానాస్పద అంతర్జాతీయ ఫోన్‌ కాల్స్‌ వదంతుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జమ్ముకాశ్మీర్ పోలీసులు సూచనలు జారీ చేశారు.

Also Read: RUSSIA:అమెరికన్లపై నిషేధం..లిస్టులో ఒబామా..!

- Advertisement -