స్పై యాక్షన్ థ్రిల్లర్..‘G2’

1
- Advertisement -

బ్లాక్ బస్టర్ స్పై థ్రిల్లర్ గూఢచారికి సిక్వెల్‌గా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘G2’ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. 2027 ఫిబ్రవరి 5న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ కానుంది.

వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం, ఫస్ట్ పార్ట్ గూఢచారి సక్సెస్‌ను బేస్‌గా తీసుకుని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నారు ఇండియన్ సినిమాలో స్పై థ్రిల్లర్ జానర్‌ ని రీడిఫైన్ చేయనుంది.

ఈసారి ఏజెంట్ 116గా వామికా గబ్బి ఎంట్రీ ఇస్తోంది. యాక్షన్‌తో పాటు ఎమోషన్‌ వున్న క్యారెక్టర్ ఇది. ఈ మూవీలో ఇమ్రాన్ హష్మీ పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. మురళీ శర్మ, సుప్రియా యార్లగడ్డ, మధు శాలిని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై టి.జి. విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. తెలుగు తో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియాగా రిలీజ్ కానుంది.

Also Read:మోదీ@76..ప్రముఖుల విషెస్

పవర్‌ఫుల్ క్యాస్ట్, అంతర్జాతీయ స్థాయి ప్రొడక్షన్, గ్రాండ్ విజన్‌తో G2, 2027లో మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులని అలరించనుంది.

- Advertisement -