హోంశాఖ సహాయమంత్రిగా నాడు విద్యాసాగర్ రావు…నేడు కిషన్ రెడ్డి

484
vidyasagar rao
- Advertisement -

మోడీ కేబినెట్‌లో మంత్రిగా తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇక కిషన్ రెడ్డికి కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. గతంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా కరీంనగర్‌ నుంచి ఎన్నికైన,ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు పనిచేశారు. ఇప్పుడు అదే శాఖను కిష‌న్ రెడ్డికి కేటాయించారు మోడీ.

తనపై నమ్మకముంచిన ప్రధానమంత్రి మోడీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఐదేండ్లూ దేశాభివృద్ధి కోసం ఆయన నేతృత్వంలో సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ నినాదంతో ముందుకువెళతామని చెప్పారు.

1964, మే 15న రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ లో జన్మించారు గంగపురం కిషన్ రెడ్డి. ఏబీవీపీ,ఆరెస్సెస్‌ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేవైఎం బలోపేతానికి కృషిచేశారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2002లో బీజేవైఎం జాతీయ అధ్యక్షడిగా ఎన్నికయ్యారు.

2004లో తొలిసారి హిమాయత్ నగర్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత వరుసగా 2009, 2014లో అంబర్ పేట నుంచి గెలిచారు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా, బీజేపీ రాక్ష అధ్యక్షడిగా పనిచేశారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ సునామీ ముందు ఓటమి పాలయ్యారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా గెలుపొందారు.

- Advertisement -