కరోనా…ఇలా ఎవరైనా ఊహించి ఉంటారా..?

369
coronavirus critisism
- Advertisement -

కరోనా…ఈ పేరు వింటేనే ప్రజలు గజగజ వణికిపోతున్న పరిస్ధితి నెలకొంది. ఎక్కడో చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పటివరకు 213 దేశాలకు విస్తరించి లక్షలాదిమందిని బలితీసుకుంది. మూడు నెలల్లో పరిస్థితులు మారిపోతాయని ఎవరైనా ఊహించి ఉంటారా? అందరూ ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుందని అనుకుని ఉంటారా? కానీ ఒకే ఒక్క కరోనాతో ఇప్పుడు పరిస్ధితులు పూర్తిగా మారిపోయాయి.

కరోనా పేరు చెబితే ఎంత బయపడుతున్నారో అంతే వ్యంగ్యాస్త్రాలతో ఆడుకుంటున్నారు నెటిజన్లు. చైనా వాళ్లు ఇప్పటివరకు అన్ని డూప్లికేట్ కనిపెట్టారు…కరోనా ఒక్కటే ఒరిజినల్ అందుకే ఇంతమంది ఇబ్బందిపడుతున్నారని చెప్పుకొచ్చారు.

ఇక కరోనాతో ఇప్పటివరకు చూడకూడనివి కూడా చూడాల్సి వస్తోంది. డాక్టర్లకు సెక్యూరిటీ గార్డ్స్ టెంపరేచర్‌ని చెక్ చేయాల్సిన పరిస్ధితి నెలకొంది. ఇలాంటి వార్తలను షేర్ చేస్తున్న నెటిజన్లు అసలు ఎవరైనా ఇలాంటివి ఎక్స్‌పెక్ట్ చేస్తారా అంటూ నవ్వుకుంటున్నారు.

ఇక లాక్ డౌన్ 5.0పై కూడా జోకులు పేలుతున్నాయి. వందలోపు కేసులు ఉన్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుని 2 లక్షలకు కరోనా కేసులు చేరువ అవుతుంటే హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌, ప్రార్థనా మందిరాలు. ఇలా అన్నింటికి తలుపులు తెరిచి లాక్‌డౌన్ కొనసాగింపు అని ప్రకటన రావడంపై నెటిజన్లు ఫన్నీ మీమ్స్ పోస్టు చేస్తున్నారు.

- Advertisement -