ఫ్లాపులొస్తున్నా ఆమెకు ఫుల్ డిమాండ్

39
- Advertisement -

టాలీవుడ్ లో ఉప్పెనలా దూసుకొచ్చింది ఆషిక రంగనాథ్‌. ఆమె నటించిన అమిగోస్, నా సామిరంగ సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ, ‘ఆషిక రంగనాథ్‌’ నేచురల్ యాక్టింగ్ టాలెంట్ కు టాలీవుడ్ ఫిదా అయింది. హీరోయిన్స్ లో చాలా అరుదుగా కనిపించే క్వాలిటీ అది. అందుకే, వరుసగా రెండు సాలిడ్ ప్లాప్ లు పడినా మళ్లీ వెనుతిరిగి చూడటం లేదు ఈ ముద్దుగుమ్మ. తనకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటూ ఆషిక రంగనాథ్‌ దర్శకనిర్మాతలతో మంచి రిలేషన్ కూడా మెయింటైన్ చేస్తోంది. దీంతో, ఆషిక రంగనాథ్‌ కి తెలుగులో అవకాశాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

మొత్తానికి ప్రస్తుతానికి అయితే, ఆషిక రంగనాథ్‌ వరుస పెట్టి సినిమాలకు సైన్ చేస్తోంది. ఈ క్రమంలో ఆమె బ్యానర్, హీరో మాత్రమే చూస్తోంది తప్ప… కథలు, అందులో పాత్రల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇందుకే, ఆషిక రంగనాథ్‌ వరుసగా ఫ్లాపులొచ్చాయి. ఐతే, ఇలా ఎన్ని ఫ్లాపులు వచ్చినప్పటికీ, ఆషిక రంగనాథ్‌ ధైర్యంగా ఉందంటే దానికి ఏకైక కారణం ఆమెకు ఉన్న డిమాండే. పైగా తాజాగా కెరీర్ లో తొలిసారి విజయ్ లాంటి పెద్ద హీరో సినిమాలో అవకాశం అందుకుంది. ఆ రకంగా తమిళంలో కూడా ఆమెకు అదృష్టం కలిసొచ్చింది. పైగా విజయ్ సినిమాలో ఆషిక రంగనాథ్‌ ను మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నారు.

సో.. తెలుగులో తనకు ఎన్ని ఫ్లాపులొస్తున్నప్పటికీ.. విజయ్ సినిమా తన కెరీర్ కు పిల్లర్ గా నిలబడుతుందని ఆమె ఆశలు పెట్టుకుంది. మరి ఆషిక రంగనాథ్‌ ఆశ నెరవేరుతుందా ?, నిజానికి నా సామిరంగా సినిమా విషయంలోనే ఆషిక రంగనాథ్‌ పాత్రపై ఎన్ని విమర్శలు పడ్డాయో, వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా విజయ్ సినిమా విషయంలో కూడా ఆషిక రంగనాథ్‌ కార్నర్ అవుతుంది అని, అసలు ఆషిక రంగనాథ్‌ లో కమర్షియల్ హీరోయిన్ లేదు అని తమిళ మీడియా కూడా ఆమెను టార్గెట్ చేస్తోంది. అటు ప్రేక్షకులు కూడా ఆషిక రంగనాథ్‌ పై నెగిటివ్ ఫీలింగ్ తోనే ఉన్నారు. అయినప్పటికీ, ఆషిక రంగనాథ్‌ కి అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

- Advertisement -