- Advertisement -
పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలనంటుతున్నాయి. సామాన్యుడిపై గుదిబండలా మారాయి పెట్రోల్ ధరలు. రోజు రోజుకూ క్రమంగా పెరుగుతూ పోతున్నాయి. దీంతో సామాన్యుడు ప్రజారవాణా వ్యవస్థను ఆశ్రయిస్తున్నాడు. తాజాగా ఇంధనం ధరలు మంగళవారం కూడా పెరిగాయి. . దేశవ్యాప్తంగా పలు చోట్ల పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 23 పైసలు, డీజిల్‌పై 29 పైసలు పెరిగింది. ఢిల్లీలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.82.86, డీజిల్ రూ.74.11గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్‌పై 23 పైసలు, డీజిల్ 31 పైసలు పెరిగింది. ముంబైలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.87.73, డీజిల్ రూ.77.68గా ఉంది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్ రూ.87.21, డీజిల్ రూ.80.61గా ఉండగా..విజయవాడలో పెట్రోల్ రూ.86.46, డీజిల్ 79.52, గుంటూరులో పెట్రోల్ రూ.86.66, డీజిల్ రూ.79.72గా ఉంది.
- Advertisement -