సోనమ్‌పై కంగనా కామెంట్స్‌..

235
Kangana Ranaut
- Advertisement -

‘క్వీన్’ దర్శకుడు వికాస్ బెహెల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇటీవల ఆరోపించింది. ఈ ఆరోపణలపై మరో నటి సోనమ్ కపూర్ స్పందిస్తూ, కొన్నిసార్లు కంగన చేసే వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవడం కష్టమని, అయినప్పటికీ ఆమె తనకు జరిగిన ఘటనల గురించి ధైర్యంగా బయటపెట్టడం అభినందించదగ్గ విషయమని..ఈ విషయంలో ఆమెను తాను గౌరవిస్తానని చెప్పింది.

Kangana Ranaut

అయితే సోనమ్‌ తన గురించి అలా అనడంతో కంగనకు కోపం వచ్చింది. ‘కంగన చెప్పేవి సీరియస్‌గా తీసుకోవడం కష్టం’ అని సోనమ్‌ అన్న మాటలకు అర్థం ఏంటి? అంటే కొందరు మహిళలను మాత్రమే నమ్మాలన్న లైసెన్స్‌ ఆమెకు ఉందా? నాకు జరిగిన వేధింపుల గురించి నేను చెప్పుకొన్నాను. నేను చెప్పేవి తప్పు అని ఆమె ఎలా చెప్పగలుగుతోంది? ఎన్నో అంతర్జాతీయ కార్యక్రమాల్లో భారత్‌ తరఫున పాల్గొన్నాను. ఆ కార్యక్రమాల్లో నన్ను యువతకు రోల్‌మోడల్‌ అని ప్రశంసించేవారు. అని కంగన తెలిపింది.

అంతేకాదు నా తండ్రి వల్ల నాకు గుర్తింపు దక్కలేదు. పదేళ్లుగా కష్టపడుతూ ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్నా. సోనమ్‌ అంత గొప్ప నటి ఏమీ కాదు. గొప్పగా మాట్లాడుతుంది అన్న పేరు కూడా లేదు. ఇలాంటి సినీ సెలబ్రిటీలకు నా గురించి మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? వారందరినీ అణచివేస్తాను.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు కంగన.

- Advertisement -