చిరంజీవికి శుభాకాంక్షలు :ఎఫ్దీసి చైర్మన్ అనిల్

159
- Advertisement -

53వ ఇంటర్‌నేషనల్ ఫిల్మ్‌ ఫెస్టివల్ ఆఫ్‌ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికచేసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర టీవీ థియేటర్స్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం శుభకాంక్షలు తెలిపారు.

ఈసందర్భంగా అనిల్ మాట్లాడుతూ… తెలుగు జాతి గర్వించదగిన రోజు అని అన్నారు. చిత్రపరిశ్రమలో తెలుగు వారి కృషిని నలుదిశలా వ్యాపింపజేసిన వారిలో చిరంజీవి ఒకరని అన్నారు. స్వీయ ప్రతిభే ఆయన కెరీర్‌కు పునాది రాళ్లుగా మార్చుకొని, అడుగడుగునా సవాళ్లను అధిగమించి చరిత్ర సృష్టించి, బాక్సాఫీసు రికార్డులు సృష్టించి, ఒక్కో నిచ్చెన ఎక్కుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్‌గా ఎదిగిన ఆయన జీవితం నేటి తరం నటులకు ఆదర్శమని అనిల్ కుర్మాచలం అన్నారు.

ఇవి కూడా చదవండి…

అమెరికా రైట్స్‌ను కొనుగోలు చేసిన శ్లోకా…

అరుదైన వ్యాధికి గురైన ఖురానా….

పిక్ టాక్ :  అంతా బికినీమయం,  ఈ ఫోటో అంతా బికినీ మయం !

- Advertisement -