- Advertisement -
ప్రియా ప్రకాశ్ వారియర్ ఈమె వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. కన్ను కొడుతూ యువకుల మనసులను దోచిన ఈ మలయాళీ సుందరికి మరో కష్టం వచ్చిపడింది. ఆమె నటించిన ”ఒరు అదార్ లవ్” సినిమాలోని మాణిక్య మలరయ అనే పాటకు కన్నుకొడుతూ పలికించే హావభావాలపై గతంలో హైదారాబాద్ కు చెందిన కొందరు ముస్లీం యువకులు కేసు పెట్టారు.

ఇదిలా ఉంటే ఆమెపై తాజాగా మళ్లీ హైదరాబాద్ కు చెందిన ముస్లీంలు సుప్రీంకో్ర్టును ఆశ్రయించి ఇలాంటి హావాభావాతో కన్నుకొట్టే సీన్లు ఇస్లాంకు పూర్తిగా వ్యతిరేకమేనని పిటిషన్ లో తెలిపారు. సినిమాకు విడుదలను అంగీకరించే ముందు ఇలాంటి విషయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఈ వివాదాల నేపథ్యంలో మార్చి 1న విడుదల కావాల్సిన సినిమా జూన్‌కు వాయిదా పడింది.
- Advertisement -

