ఫ్రీడం హైదరాబాద్ 10కె రన్ టీషర్ట్స్ ఆవిష్కరణ

374
10k Run
- Advertisement -

హైదరాబాద్ 10కె రన్ ఫౌండేషన్ మరియు ఈవెంట్స్ నౌ సంయుక్తంగా ఫ్రీడం హెల్తీ కుకింగ్ ఆయిల్ భాగస్వామ్యంతో హైదరాబాద్ 10కె రన్ 2019 అధికారిక రేస్ టీషర్ట్ లు , ఫినీషర్స్ మెడల్స్ , ట్రోఫీలను విడుదల చేశారు. ఫ్రీడం హైదరాబాద్ 10కె రన్ 2019ను 24 నవంబర్ 2019న నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజాలో నిర్వహించనున్నారు. దక్షిణ భారతదేశంలో అతి పురాతనమైన మరియు అతిపెద్ద రన్నింగ్ కార్యక్రమాలలో ఒకటి హైదరాబద్ 10కె రన్. ప్రతి ఏడాది నవంబర్ చివరి ఆదివారం రోజున ఈ 10కె రన్ జరుగుతుంది.

Picture-2

ఈసందర్భంగా రేస్ డైరెక్టర్ డాక్టర్ మురళి నన్నపనేని మాట్లాడుతూ.. ఫ్రీడం హైదరాబాద్ 10కె రన్ పట్ల మేము పూర్తి ఆనందంగా ఉన్నాం. నగరంలోని పరుగు ప్రియుల నుండి అపూర్వమైన ప్రోత్సాహాన్ని మేము అందుకుంటున్నాం. హైదరాబాద్ 10కె రన్ కోసం మేము ప్రత్యేకమైన మార్గం రూపొందించాం. ఈ రేస్ పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభమవుతుంది. హుస్సేన్ సాగర్ సరస్సు చుట్టూ ఉన్న ప్రాంతాలను కవర్ చేసి మరలా పీపుల్స్ ప్లాజా వద్ద ముగుస్తుంది.

వైస్ ప్రెసిడెంట్ పీ. చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ…. 17వ ఎడిషన్ ఫ్రీడం హైదరాబాద్ 10కె రన్ 2019ను హైదరాబాద్ లో సమర్పిస్తుండటం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఆరోగ్యవంతమైన జీవనశైలి ప్రొత్సహించే రీతిలో దీనిని డిజైన్ చేశారు. మై ఫ్రీడం హెల్తీ ఫ్యామిలీ ఉపయోగించి పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై ఆరోగ్యవంతమైన కార్యక్రమాలు చేస్తున్న ఫ్యామిలీ పిక్చర్ ను పంచుకోవాల్సిందిగా మేము నగరవాసులను ఆహ్వానిస్తున్నాం.

సీఈవో ఈవెంట్స్ నౌ రాజ్ పాకాల మాట్లాడుతూ.. 17వ ఎడిషన్ ఫ్రీడం హైదరాబాద్ 10కె రన్ 2019ను నిర్వహిస్తుండటం పట్ల మేము సంతోషంగా ఉన్నాం. అన్ని వర్గాల ప్రజలు ఈ రేస్ లో పాల్గోనడంతో పాటుగా రన్ టు బీ ఫ్రీ, మై సిటీ మై రన్ 2019 ద్వారా నగర వారసత్వాన్ని ప్రచారం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమ నిర్వహణలో తమ మద్దతు నందిస్తోన్న భాగస్వాములకు ఈసందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం.

- Advertisement -