ఫ్రీగా వ్యాక్సిన్ ఇవ్వండి: ప్రధానికి కవిత ట్వీట్

130
kavitha
- Advertisement -

దేశవ్యాప్తంగా మే 1 నుండి 18 సంవత్సరాలు పైబడిన వారందరికి కరోనా వ్యాక్సినేషన్ అందించనున్న సంగతి తెలిసిందే. అయితే పలు రాష్ట్రాలు తమ ప్రజలకు ఫ్రీగా వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు ముందుకురాగా కేంద్రం వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బడ్జెట్‌లో టీకాల కోసం 35 వేల కోట్లు కేటాయించిన మోదీ సర్కార్‌…..వ్యాక్సినేషన్‌ విషయంలో చేతలు ఎత్తేసింది. లిమిటెడ్‌గా ఫ్రీగా అందిస్తామని ప్రకటించగా ప్రతిపక్షాలు పలు కీలక సూచనలు చేశాయి.

ఇందులో భాగంగా ఫ్రీగా టీకా ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ట్వీట్ చేశారు ఎమ్మెల్సీ కవిత. ప్రియమైన మోడీ జీ, తమ ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ అందించడానికి అనేక రాష్ట్రాలు ముందుకు వచ్చాయి…పాన్ ఇండియాలో భాగంగా ఫ్రీగా టీకాలు ఇచ్చి జాతీయవాదం యొక్క స్ఫూర్తిని చూపించాలని కోరారు.

- Advertisement -