విద్యార్ధులకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్లు…ఎక్కడో తెలుసా..?

322
student smartphones
- Advertisement -

కరోనా వైరస్ మహమ్మారి నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి భారీ మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇంటర్ ప్రవేశాలు ఆన్‌లైన్‌ ద్వారా జరపడం, సీట్ల కేటాయింపులో రిజర్వేషన్లు,కాలేజీల పనివేళల్లో కూడా మార్పులు తీసుకొచ్చేలా ప్లాన్ సిద్ధం చేస్తోంది.

అయితే తాజాగా ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సాంఘిక సంక్షేమ పాఠశాల్లలో 9వ తరగతి నుండి ఇంటర్ వరకు చదివే విద్యార్ధులకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్లను అందించాలని నిర్ణయించింది.

కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం దేశమంతటా ఆన్‌లైన్‌లోనే విద్యావ్యవస్ధ నడుస్తోంది. ఈ క్రమంలో పేద విద్యార్ధులకు చదువు దూరం,భారం కాకుండా ఉండేందుకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్లను అందించాలని గురుకులాల సొసైటీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

ఈపథకంలో భాగంగా రూ. 5 వేల నుంచి రూ. 6 వేల విలువ చేసే స్మార్ట్‌ఫోన్లను అందించనున్నారు. అలాగే పరిశుభ్రత, పచ్చదనం మైంటైన్ చేస్తూ తొలిస్థానంలో నిలిచే గురుకులానికి రూ. 50 వేలు, రెండో స్థానంలో నిలిచిన గురుకులానికి రూ. 30 వేలు ప్రోత్యాహకంగా ఇవ్వాలని నిర్ణయించారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై విద్యార్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

- Advertisement -