దుర్గమ్మ దర్శనానికి బ్రేక్..!

732
vijayawada temple
- Advertisement -

దేశవ్యాప్తంగా ఈ నెల 8 నుండి హోటళ్లు, షాపింగ్ మాల్స్‌తో పాటు ఆలయాలు తెరచుకోనున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండున్నర నెలల తర్వాత ఆలయాలు తెరచుకోనుండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇప్పటికే మే 8 నుండి శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించిన టీటీడీ  ఇందుకు సంబంధించి కొన్నిమార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.

అయితే విజయవాడ దుర్గమ్మ దర్శనం మాత్రం ఇప్పట్లో ఉండేలా కనిపించడం లేదు. ఎందుకంటే దుర్గమ్మ సన్నిధి దిగువున కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత పెరుగుతుండడంతో అమ్మవారి ఆలయానికి భక్తులను అనుమతించాలా లేదా అనే దానిపై దుర్గగుడి అధికారులు తర్జన బర్జనపడుతున్నారు.

ఎందుకంటే కొండ వెనకాల విద్యాధరపురం, కుమ్మరిపాలెంసెంటర్, భవానీపురం, కొండ‌దిగువున మల్లికార్జునపేట ఇతర ప్రాంతాల్లో అంతకంతకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కనకదుర్గమ్మ దర్శనానికి సంబంధించి ఏపీ దేవాదాయ శాఖ అధికారులు ఎలాంటి మార్గదర్శకాలను విడుదల చేయలేదు.

అయితే ఆలయ అధికారులు మాత్రం ముందస్తుగా దుర్గమ్మ దర్శనానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆన్ లైన్ దర్శనం నుండి క్యూలైన్లు, లడ్డూ కౌంటర్‌ల వరకు అన్నిజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. టీటీడీ తరహాలోనే పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతివ్వడం లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా దేవాదాయ శాఖ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప భక్తులకు కనకదుర్గమ్మ దర్శనం అయ్యేలా కనిపించడంలేదు.

- Advertisement -