ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్

251
cmkcr-trslp
- Advertisement -

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం, టీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ,పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ నాయకులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని గిరిజనులపై వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తామని ప్రకటించారు.

kcr-trs

ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు 50 యూనిట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత కరెంటును అందిస్తోంది. ఉచిత కరెంటును 50 యూనిట్ల నుంచి 101 యూనిట్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌కు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే డిస్కంలకు అందిస్తుందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో టీవీల వినియోగంతో పాటు ఇతర విద్యుత్‌ పరికరాలతో కరెంటు వాడకం పెరిగిందని, తెలంగాణ రాష్ట్రంలో కరెంటు పరిస్థితి మెరుగుపడినందున దాని ఫలితం రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల ప్రజలకు చేరాలన్న ఉద్దేశ్యంతోనే 101 యూనిట్ల వరకు విద్యుత్‌ను వినియోగించే ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి ఉచితంగా విద్యుత్‌ను అందివాలన్నదే ప్రభుత్వం సంకల్పమని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

- Advertisement -