ఆ రెండు గ్యారెంటీలు..ఎప్పటినుంచి అంటే?

22
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు గ్యారెంటీ హామీల అమలుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పెంపు వంటి హామీలను అమల్లోకి తెచ్చిన తెలంగాణ సర్కార్.. ఇప్పుడు 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ.500 లకే వంటగ్యాస్ వంటి పథకాలను అమల్లోకి తీసుకోచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ రెండు పథకాల అమలపై కాంగ్రెస్ సర్కార్ అడపా దడపా హింట్ ఇస్తూనే ఉంది. ఇక ప్రస్తుత పరిణామాలు చూస్తే ఎన్నికలకు ముందే ఈ రెండు హామీలను అమల్లోకి తెచ్చే దిశగా సి‌ఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇటీవల నిర్వహించిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పథకాల అమలుకై కీలక విషయలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ.500 లకే వంటగ్యాస్.. పథకాల యొక్క విధివిధానాలు, వాటి అమలుకు సంభందించిన తేదీ వంటి అంశాలను కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం.

. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ నెల 27 లేదా 29న ఈ రెండు పథకాలను అమలు చేయనున్నట్లు వినికిడి. ఎందుకంటే వచ్చే నెల పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉండడంతో ఆ తర్వాత ఎన్నికలు ముగిసే వరకు కొత్త పథకాల అమలు దాదాపు అసాధ్యం. అందువల్ల ఈ నెలలోపే ఆ రెండు పథకాలను అమలు చేసి ఎన్నికల ప్రచారానికి వెళ్ళే దిశగా కాంగ్రెస్ సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పథకాలకు ఎవరెవరు అర్హులు ? అందరికీ వర్తిస్తాయా ? లేదా షరతుల మేర పథకాల అమలు జరగబోతుందా ? అనే అంశాలపై ఎలాంటి క్లారిటీ లేదు.

ఇకపోతే గృహాలక్ష్మి పథకంలో భాగమైన రూ.500లకే వంట గ్యాస్ కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే వర్తించేలా కాంగ్రెస్ సర్కార్ ప్లాన్ చేస్తోందట. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఇక 200 యూనిట్ల ఉచిత కరెంటు ఎవరికి వర్తింపజేయాలనే దానిపై కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణం హామీ సరైన రీతిలో అమలు చేయలేదనే విమర్శ తరచూ వినిపిస్తోంది. మరి ఆ పథకంలో జరిగిన పొరపాట్లను రూ.500 లకే వంటగ్యాస్, 200 యూనిట్ల ఉచిత కరెంటు.. వంటి పథకాలలో జరగకుండా ప్రాపర్ గా అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Also Read:ఈ డ్రింక్స్ తాగితే ఎన్ని లాభాలో!

- Advertisement -