రైతు కూలీలకు అండగా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్..

110
food

దేశానికి వెన్నెముక లాంటి రైతులు లాక్ డౌన్ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతు కూలీలకు అండగా నిలవాలని రాజ్యసభ జోగినిపల్లి సంతోష్ కుమార్ నడుంబిగించారు. లాక్ డౌన్ పూర్తి అయ్యేంతవరకు కరీంనగర్ మార్కెట్ కార్యాలయం యందు రైతు కూలీలందరికీ అన్నదాన కార్యక్రమం ఉంటుందని డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి హరిశంకర్ తెలిపారు.

ఈ అన్నదాన కార్యక్రమం లాక్ డౌన్ పూర్తయ్యేంత వరకు కొనసాగుతుందని తెలిపారు. రైతు కూలీలు కాకుండా ఇతర పేదవారికి కూడా అన్నదానం చేస్తున్నామని అన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్నీ నిర్వహిస్తున్న ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కి రైతు కూలీలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మరియు బోయినపల్లి జడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్య , కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మైన్ ఎలుక అనిత ఆంజనేయులు పాల్గొన్నారు.