గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ వారు, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పేరుతో మల్లాపూర్ డివిజన్ నాచారం పోలీస్టేషన్ సీఐ మహేష్ గౌడ్ సమక్షంలో సీఐ చేతులమీదుగా రోజువారీ కూలీలకు, ఆటోడ్రైవర్లకు వీఎన్‌ఆర్ గార్డెన్‌లో నిత్యావసర సరుకులను అందజేయడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు రాజ్యసభ సభ్యులు సూచన మేరకు ఈ రోజు వలస కూలీలకు రోజువారీ కూలీలకు, ఆటోడ్రైవర్లకు నిత్యావసర సరుకుల ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా నాచారం పోలీస్‌స్టేషన్ సిఐ మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టె కార్యక్రమం గుడికి వెళ్లి దేవుని దర్శనం చేసుకున్నాదానికంటే చాలా గొప్పది అని, మానవ సేవ మాధవ సేవ అని నమ్మే ఎంపీ సంతోష్ కుమార్‌ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో కార్యనిర్వాహకుడు బోజనారాయన, సిఐ మహేష్ గౌడ్ లు, కో ఫౌండరు రాఘవ పాల్గొని 200 మందికి సరుకులు అందజేశారు.