ఆగస్టు 5 నుండి ఉచితంగా చేపపిల్లల పంపిణీ: తలసాని

297
talasani srinivas
- Advertisement -

ఆగస్టు 5 నుండి ఉచితంగా చేప పిల్లల పంపిణీని ప్రారంభిస్తున్నామని తెలిపరు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాబద్ మాసాబ్ ట్యాంక్ లోని కార్యాలయంలో పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖల పై సమీక్ష నిర్వహించిన మంత్రి రాష్ట్రంలోని 24 వేల చెరువులు, రిజర్వాయర్ లలలో 50 కోట్ల రూపాయల వ్యయంతో 81 కోట్ల చేప పిల్లలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.

10 కోట్ల రూపాయల వ్యయంతో 5 కోట్ల రొయ్య పిల్లల విడుదల చేయనున్నామని….కరోనా నేపద్యంలో చేప పిల్లల విడుదల సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు , స్ధానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు.

ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో మత్స్యకారుల కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉన్నాయి.త్వరలోనే 2 వ విడత గొర్రెలు, పాడి గేదెల పంపిణీ చేపడతాం…ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలు, పాడి గేదెలకు సంబంధించిన పెండింగ్ ఇన్సురెన్స్ ను నెల రోజులలలో చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

కృత్రిమ గర్భధారణ కార్యక్రమంలో దేశంలోనే మొదటిస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచిందని…ఆగస్టు 1 నుండి మే 2021 వరకు కృత్రిమ గర్భధారణ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.త్వరలోనే మెగా డైరీ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విజయ డైరీ లాభాల బాటలో పయనిస్తుంది.విజయ డైరీ ఉత్పత్తుల విక్రయాలు మరింతగా పెంచేందుకు పెద్ద ఎత్తున ఔట్ లెట్ ల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

- Advertisement -