AP:మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభం

8
- Advertisement -

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభం అయింది. విజయవాడ బస్ స్టేషన్ లో ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. ఉండవల్లి నుంచి ప్రత్యకంగా ఏర్పాటు చేసిన బస్సులో మహిళలతో కలిసి ప్రయాణం చేశారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ , మంత్రి లోకేష్.

మహిళలు ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే వెసులుబాటు కల్పించారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నారు.

ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉండగా “స్త్రీ శక్తి” పథకం ద్వారా 2.62 కోట్ల మంది మహిళలు లబ్ది పొందనున్నారు. “స్త్రీ శక్తి” పథకం అమలు వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.1,942 కోట్ల భారం పడనుంది.

Also Read:బీఆర్‌ఎస్ సైనికుడిని:రోహిత్ రెడ్డి

- Advertisement -