వార్షిక టోల్ పాస్‌..ఇలా అప్లై చేసుకోండి!

11
- Advertisement -

ఫాస్టాగ్ వినియోగదారుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త టోల్ విధానాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ్టి నుండి ఈ విధానం అందుబాటులోకి రాగా రూ. 3వేలు రుసుము చెల్లించి వార్షిక పాస్ పొందవచ్చు. ఈ పాస్ ఒక ఏడాది పాటు లేదా జాతీయ రహదారిపై ఏదైనా ఫీజు ప్లాజా ద్వారా 200 క్రాసింగ్‌లకు వరకు వర్తిస్తుంది. ఇందులో ఏది ముందు పూర్తి అయితే అది వర్తిస్తుంది. ప్రతి ఫీజు ప్లాజాలో వసూలు చేసే ఫాస్ట్ ట్యాగ్ రుసుముతో సంబంధం ఉండదు.

కేవలం చాసిస్ నంబర్‌తో రిజిస్టర్ చేసిన ఫాస్ట్ ట్యాగ్స్‌పై వార్షిక పాస్ జారీ అవుతుంది. వార్షిక పాస్‌ను యాక్టివేట్ చేసేందుకు వాహన రిజిస్ట్రేషన్ నంబర్ (VRN)ను అప్‌డేట్ చేయాలి.

అలాగే వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC),వాహన యజమాని పాస్‌పోర్ట్ సైజు ఫొటో,వాహన యజమాని కేటగిరీ KYC డాక్యుమెంట్లు,ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. ఆన్‌లైన్ లో NHAI ఫాస్ట్ ట్యాగ్‌ను ఇ-కామర్స్ వెబ్‌సైట్ల నుంచి కొనుగోలు చేయవచ్చు. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంక్, HDFC బ్యాంకు మొదలైన బ్యాంక్ పోర్టల్స్ నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు.

రాజ్‌మార్గయాత్ర మొబైల్ అప్లికేషన్ లేదా ఎన్‌హెచ్ఏఐ వెబ్‌సైట్ ద్వారా 2025–26 బేస్ సంవత్సరానికి రూ. 3వేలు పేమెంట్ చేయాలి. పేమెంట్ తర్వాత వార్షిక పాస్ సాధారణంగా 2 గంటల్లోపు రిజిస్టర్డ్ ఫాస్ట్ ట్యాగ్‌లో యాక్టివేట్ అవుతుంది.

Also Read:బీఆర్‌ఎస్ సైనికుడిని:రోహిత్ రెడ్డి

- Advertisement -