- Advertisement -
దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో నేటి నుండి బూస్టర్ డోసు వేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించింది. దేశంలోని అన్ని ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా 75 రోజుల పాటు బూస్టర్ డోస్ వేయనున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగనుంది. 18 నుంచి 59 ఏళ్ళ మధ్య వయసు వారికి బూస్టర్ డోసు వేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిన్న రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య శాఖల కార్యదర్శులతో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వర్చువల్ పద్ధతిలో సమావేశం నిర్వహించారు.
సాధారణంగా రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత శరీరంలో యాంటీ బాడీల స్థాయులు తగ్గుతాయి. బూస్టర్ డోసు తీసుకుంటే రోగనిరోధక ప్రతిస్పందన పెరుగుతుంది.
- Advertisement -