ఫోర్త్ సిటీ టూ అమరావతి..గ్రీన్‌ఫీల్డ్ హైవే

7
- Advertisement -

ఫోర్త్ సిటీ నుండి అమరావతికి కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు ప్రతిపాదన వచ్చింది. హైదరాబాద్‌లో నిర్మించాలని చూస్తున్న డ్రై పోర్టు నుండి మచిలీపట్నం పోర్టుకు రైలు మార్గం గురించి ప్రతిపాదన పెట్టింది తెలంగాణ ప్రభుత్వం.

ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలపై ఇటీవల సమావేశం నిర్వహించారు కేంద్ర హోంశాఖ. ఈ సమావేశంలో హైదరాబాద్ ఫోర్త్ సిటీ నుండి అమరావతి వరకు నూతన రహదారి నిర్మించాలని ప్రతిపాదించింది రాష్ట్ర ప్రభుత్వం.

ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, డీపీఆర్ రూపొందించాలని కేంద్ర రవాణా శాఖకు ఆదేశాలు ఇచ్చింది కేంద్ర హోంశాఖ.ఫోర్త్ సిటీని అమరావతిని కలిపేలాగా రహదారి ఉంటే బాగుంటందని ఏపీ అధికారాలకు వివరించారు తెలంగాణ అధికారులు. ఈ ప్రతిపాదనపై ఏపీ అధికారుల స్పందన కోసం వేచి చూన్నారు తెలంగాణ అధికారులు.

Also Read:హైలీ ఎంటర్‌టైనింగ్..’జూనియర్’

- Advertisement -