ముంబైలో అగ్నిప్రమాదం..నలుగురు మృతి

202
Four dead after fire breaks out at Crystal Tower in Parel

ముంబైలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక పరేల్ ప్రాంతంలోని క్రిస్టల్ టవర్లో ఉన్న 16 అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో 12వ అంతస్తులో ఈరోజు ఉదయం ( బుధవారం) ఈ ఘటన జరిగింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు.

fire breaks out at Crystal Towerకాగా ..ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, పదహారు మంది గాయపడ్డారు. అపార్ట్‌ మెంట్‌ లోచిక్కుకుపోయిన వారిని క్రేన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకొచ్చారు.ఈ ప్రమాద సంఘటనను బృహన్ ముంబయి కార్పొరేషన్, అగ్నిమాపక శాఖాధికారులు ధ్రువీకరించారు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.