కాంగ్రెస్ కు మరో షాక్… బీజేపీలోకి మల్కాజ్ గిరి మాజీ ఎంపీ

557
SArve Satyanarayana
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. కాంగ్రెస్ లో అసంతృప్తిగా ఉన్న నాయకులను తమ పార్టీలో చేర్పించుకుంటున్నారు బీజేపీ అగ్రనాయకత్వం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు కాంగ్రెస్ అధిస్టానం షోకాజ్ నోటిసులు పంపించింది. కాగా త్వరలోనే ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తుంది.

  తాజాగా ఉన్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీలో మరో కీలక నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తుంది. మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ బీజేపీ చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారని సమాచారం.

తెలుగుదేశం పార్టీ నుంచి పెద్దిరెడ్డి, చాడా సురేష్‌రెడ్డి, బోడ జనార్దన్‌ సహా పలువురు నేతలు త్వరలో బిజెపిలో చేరే అవకాశం ఉంది. టీడీపి మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు కూడా బిజెపి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. చేరికల వ్యూహాన్ని ముమ్మరం చేయాలని, ముందుకు వచ్చే అందరినీ చేర్చుకోవాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కార్యనిర్వాహక అధ్యక్షుడు జె.పి.నడ్డాలు తమను కలిసిన రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు చెప్పినట్లు సమాచారం.

- Advertisement -