- Advertisement -
మిషన్ నేను సైతం సమాజం కోసం సంస్థ అధ్యక్షుడు బ్రదర్ షఫీ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ను సోమవారం తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.తమ సంస్థ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను షఫీ వివరించారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ బ్రదర్ షఫీ ని అభినందించారు.
యువకులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు స్ఫూర్తి నింపుతూా సమాజంలో మార్పు తెచ్చేందుకు బ్రదర్ షఫీ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు.ఇలాంటి సందేశాత్మక కార్యక్రమాలకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.వినోద్ కుమార్ ను కలిసిన వారిలో బ్రదర్ షఫీతోపాటు అనూహ్య రెడ్డి, శ్రీరాం, ఇబ్రహీం ఖురేషి, షకీనా, సిద్ద సాహెబ్, అశోక్, ఖిజరుల్లా, తదితరులు ఉన్నారు.
- Advertisement -