ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్ర సాధకులు,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో హరితహారం పేరుతో కోట్ల మొక్కలు తెలంగాణ రాష్ట్రంలో నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రేరణ పొంది గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో తెలంగాణలో మొక్కలు నాటి అడవులను పెంపొందించాలని గ్రీన్ ఛాలెంజ్ ని విసిరారు.
దీనికి చిన్నారుల నుండి పెద్దవాళ్లు సెలబ్రిటీస్ వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళు స్వీకరించి మొక్కలు నాటడమే కాకుండా ఇతరులకు కూడా ఈ ఛాలెంజ్‌ను విసురుతున్నారు. దీని వల్ల గ్రీన్ ఛాలెంజ్ తెలంగాణలోని హరితహారంలో ఒక మణికంఠగా నిలిచింది.
ఈ గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మహబూబాబాద్ మాజీ టీఆర్ఎస్ ఎంపీ సీతారం నాయక్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ఎంపీగా, వృక్షశాస్త్ర ఉపన్యాసకునిగా మా ఎంపీ జోగినిపల్లి సంతోష్ విసిరినటువంటి గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ ఈ రోజు హన్మకొండ చౌరస్తాలో నూతనంగా వేసిన బీట్ రోడ్ ప్రక్కన మా ఇంటి ముందే మూడు మొక్కలను ఈరోజు నాటడం జరిగింది.
అయితే విశేషమేంటంటే నా చిన్న మనవరాలు విద్మహి కూడా మొక్కను నాటిందని తెలియజేశారు. అలాగే ఈ ఛాలెంజ్‌లో మా పాత మిత్రుడు అయినటువంటి డాక్టర్ ముస్తఫా, డాక్టర్ సురేఖ మరియు కుడా డైరెక్టర్ చిర్ర రాజు,బిల్లా యాదగిరి లకు ఈ గ్రీన్ ఛాలెంజ్ విసరడం జరిగిందని తెలిపారు.