టీజీఓ తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టింది- మంత్రి

265
minister srinivas goud
- Advertisement -

ఈరోజు రవీంద్రభారతిలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా 2020 డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరైయ్యారు. మంత్రి తోపాటు TGO ప్రెసిడెంట్ మమత, TGO హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కృష్ణ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఉద్యోగుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్లప్పుడూ ప్రభుత్వం అండగా ఉంటది. అందరి సమస్యలు తెలిసిన నేత మన ముఖ్యమంత్రి అన్నారు. అలాగే త్వరలోనే PRC సమస్యను పరిష్కరిస్తాం. అదేవిధంగా CPS అనేది కేంద్రం పరిధిలో ఉంది. దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలకంగా ఉంటే CPS సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.TGO అనేదే తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిందని మంత్రి తెలిపారు.

- Advertisement -