విద్యావేత్త, రచయిత, న్యాయవాది,నిజామాబాద్ మాజీ ఎంపీ నారాయణరెడ్డి మృతి చెందారు. ఇవాళ ఉదయం అనారోగ్యంతో బాధపడుతన్న ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నారాయణరెడ్డి కన్నుమూశారు. ఆయన మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. నారాయణరెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కాగా ఈ రోజు నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలంలో ఉన్న అపురూప వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో పౌరసన్మానం ఉండగా నారాయణరెడ్డి మృతి చెందారు. పౌరసన్మాన వేదికపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గణేశ్‌గుప్త, మాజీ మంత్రి సంతోష్‌రెడ్డి సంతాపం తెలిపారు.
నారాయణరెడ్డి 1967 – 1971 మధ్య నిజామాబాద్ ఎంపీగా పనిచేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎంపీగా గెలుపొందారు. రాష్ట్ర చెరుకు రైతు సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశారు. విద్యావేత్త, రచయిత, న్యాయవాదిగా నారాయణరెడ్డి గుర్తింపు పొందారు.