మిర్యాలగూడలో ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించిన గుత్తా సుఖేందర్ రెడ్డి

266
Gutta Sukenda Reddy
- Advertisement -

దేశంలో రైతు పడించిన పంటన కొనుగోలు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపధ్యంలో మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్ లో ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈసందర్భంగా గుత్తా మాట్లాడుతూ.. ప్రకృతి సహకరించి వరుణుడు సహకరిస్తేనే ఖరిఫ్ సీజన్ ప్రారంభమయ్యే అవకాశం నెలకొందన్నారు. ప్రకృతిని దృష్టిలో పెట్టుకుని తక్కువ వ్యవధి, తక్కువ నీటిని ఉపయోగించి పండించే పంటలను వేయాలని రైతులకు పిలుపునిచ్చారు.

రైతు బంధు ద్వారా రాష్ట్రంలో36లక్షల68వేల మందికి రైతులకు 307కోట్ల రూపాయలు అందించడం జరిగిందన్నారు. ఇక రాష్ట్రంలో 12వేల13మంది రైతులు చనిపోతే రైతు భీమా కింద 5లక్షల చొప్పున 6వేల6వందల36కోట్లు చెల్లించడం జరిగిందన్నారు. రైతులు సేంద్రియ పద్దతిలో పంటలు పండించుకోవాలని తెలిపారు.

- Advertisement -