కరోనాతో మాజీ మంత్రి మృతి…

176
mathangi narsaiah
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య లక్షా 30 వేలు దాటగా 846 మంది మృతిచెందారు.తాజాగా కరోనాతో మాజీ మంత్రి మాతంగి నర్సయ్య క‌రోనాతో క‌న్నుమూశారు.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని మేడరాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రిగా సేవ‌లు అందించారు.

కరోనా బారీన పడిన ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. 15 రోజుల క్రితమే ఆయన భార్య జోజమ్మ కరోనాతో మృతిచెందారు. నర్సయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం…..ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్న‌ట్టు పేర్కొన్నారు.

- Advertisement -