కాంగ్రెస్ కు షాక్….బీజేపీలోకి మర్రి శశిధర్ రెడ్డి

420
Marri Shashidar Reddy Bjp
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కీలక నేతలు రాజీనామ చేస్తుండటంతో పార్టీ ఉనికిని కోల్పోతుంది. ఇక తెలంగాణలో అసంతృప్తులుగా ఉన్న నాయకులకు గాలం వేస్తుంది బీజేపీ. తాజాగా మరో సీనియర్ నేత బీజేపీ చేరనున్నట్లు సమచారం. మాజీ మంత్రి మర్రి శశిథర్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తుంది. గత శాసనసభ ఎన్నికల్లో ఆయన సనత్ నగర్ నుంచి సీటు ఆశించి నిరాశపడ్డారు.

మహాకూటమిలో భాగంగా సనత్ నగర్ సీటును టీడీపీకి కేటాయించారు. దాంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అయినా పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన బిజెపిలో చేరేందుకు సిద్ధపడినట్లు ప్రచారం సాగుతోంది. అలాగే మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా భార్య పద్మిని కూడా బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తుంది.

పద్మిని గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీలో చేరి వెంటనే మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చారు. జులై 6న కేంద్ర హోం మంత్రి ,బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ కు వస్తుండటంతో భారీగా చేరికలు ఉండనున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు.

- Advertisement -