చింతమడకలో పర్యటించిన మాజీ మంత్రి హరీష్‌ రావు

331
Harish Rao
- Advertisement -

సీఎం కేసీఆర్ కు జన్మనిచ్చిన ఊరు చింతమడకలో ఆయన త్వరలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈసందర్భంగా నేడు చింతమడకలో పర్యటించారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి. గ్రామంలో సభ, సమావేశాలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లన్ని పక్కాగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అనంతరం గ్రామ శివారులో హెలిప్యాడ్ స్ధలాన్ని పరిశీలించారు. గ్రామంలో అసంపూర్తిగా నిలిచిపోయిన పనులను త్వరలోనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

పెద్దమ్మ దేవాలయ ప్రాంగణంలో వన భోజనాలు ఏర్పాట్లపై స్థల పరిశీలన చేశారు. ఆలయం పక్కనే ఉన్న చింత చెట్టు కింద సీఎం కేసీఆర్ సహపంక్తి భోజనం చేసే ఏర్పాట్లను పరిశీలించారు, పక్కన ఖాళీ స్థలంలో గ్రామస్తులంతా భోజనం చేసే విధంగా ఏర్పాట్లపై, వన భోజనాల వద్ద మహిళలు, పురుషులకు వేర్వేరుగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామంలో 3600మందితో సభ నిర్వహించేలా రెయిన్ ప్రూఫ్ సభా వేదిక ఏర్పాటు చేయాలని నిర్వాహకులను సుచించారు.

- Advertisement -