- Advertisement -
తెలంగాణలో పంటలను నాశనం చేస్తున్న అడవి పందుల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. వ్యవసాయ, ఉద్యాన పంటలను నాశనం చేస్తున్న అడవిపందుల కట్టడికి చర్యలు చేపట్టనుంది. రిజర్వ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ప్రాంతాల వెలుపల అడవిపందుల నివారణకు చర్యలు తీసుకుంటుంది. ఇందు కోసం గ్రామ సర్పంచులను వన్యప్రాణుల గౌరవ సంరక్షణాధికారిగా నియమించింది ప్రభుత్వం. తీవ్రతను బట్టి అడవిపందులను కాల్చేందుకు షూటర్లకు అనుమతిచ్చే అధికారాన్ని ప్రభుత్వం సర్పంచులకు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
- Advertisement -