లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే!

68
- Advertisement -

నేటి రోజుల్లో లివర్ సమస్యలతో బాధపడే పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా మద్యపానం, ధూమపానం వంటి వ్యసనలకు అలవాటు పాడి లివర్ ఆరోగ్యాన్ని చేజెతుల నాశనం చేసుకుంటున్నారు చాలమంది. మన శరీరంలో లివర్ అత్యంత కీలకమైనది. మనం తిన్న ఆహారంలోని విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ వంటి పోషకాలను శరీర భాగాలకు సరఫరా చేయడంలో లివర్ పాత్రనే అధికం. అందుకే లివర్ పనితీరులో ఏ మాత్రం లోపం వచ్చిన అది మొత్తం శరీరంపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి రివర్ ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా మన అలవాట్ల విషయంలోనూ తినే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు పాటించక తప్పదు.

ముఖ్యంగా లివర్ పనితీరును దెబ్బ తీయడంలో మద్యపానం ధూమపానం పాత్ర అధికంగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెడు అలవాట్లను వీలైనంత త్వరగా మర్చిపోవాలి. ఇక మనం ప్రతిరోజూ తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఒట్స్, నట్స్.. వంటివి కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.
ఓట్స్
ఆరోగ్యానికి చాలా మంచిదనే మానందరికి తెలిసిందే. ఓట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల మనం తినే ఆహారం త్వరగా జీర్ణం అయ్యే విధంగా ఓట్స్ ముఖ్య భూమిక పోషిస్తాయి. ఆహారం త్వరగా జీర్ణం అయితే లివర్ పై ఒత్తిడి తగ్గి పని తీరు మెరుగుపడుతుంది. కాబట్టి రోజుకు ఒక్కసారైనా ఓట్స్ తినాలని నిపుణులు చెబుతున్నారు.

పండ్లు
పండ్లలో ఉండే పోషకాలు లివర్ పనితీరును మెరుగు పరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా సిట్రిక్ ఆమ్లం కలిగిన ద్రాక్ష, నిమ్మ, ఆరెంజ్, కివీ పండ్లు లివర్ ఆరోగ్యానికి దోహసం చేస్తాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న బ్లూ బెర్రి, యాపిల్, జామ వంటి ఫలాలు లివర్ పై చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తాయి. కాబట్టి ప్రతిరోజూ ఈ పండ్ల ను తినడం వల్ల లివర్ సమర్థవంతంగా పని చేస్తుంది.

కాఫీ, టి
సాధారణంగా కాఫీ, టీ లలో కెఫీన్ అధికంగా ఉంటుంది. కాబట్టి కాఫీ లేదా టీ ని ఎక్కువగా తాగితే ప్రమాధమని చెబుతుంటారు చాలమంది. అయితే రోజుకు ఒకటి లేదా రెండు సార్లు కాఫీ లేదా టీ తాగితే ఎన్నోప్రయోజనలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి దురమౌతుంది. అలాగే మైగ్రేన్స్ మసస్య కూడా తగ్గుతుంది. వీటన్నిటికి మించి లివర్ పై పెరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో కాఫీ లేదా టీ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాఫీ లేదా టీ తాగడం లివర్ కు మంచిదేనని నిపుణులు చెబుతున్నారు.

వీటితో పాటు ప్రతిరోజూ మనం తినే ఆహారంలో కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. మాంసహారాన్ని వారంలో ఒకటి లేదా రెండుసార్లకు మించి ఎక్కువ తీసుకోరాదు. ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల లివర్ అర్గోయమ్ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read:ఆకట్టుకుంటున్న ‘లవ్, సితార’ట్రైలర్‌

- Advertisement -