కండలు పెరగాలంటే.. ఇవి తినాల్సిందే!

183
- Advertisement -

చక్కటి శరీరకృతి కావాలని, ఫిట్ గా కంపించాలని పురుషులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఉదయం నిద్ర లేచినది మొదలుకొని ప్రతిరోజూ జిమ్ కు వెళ్తూ గంటల తరబడి కసరత్తులు చేస్తూ ఉంటారు. మరికొందరైతే ప్రాపర్ డైట్ ఫాలో అవుతూ వర్కౌట్స్ పై దృష్టి పెడుతుంటారు. అయినప్పటికి కొంతమందిలో కండలు పెరగవు, ఎంత వర్కౌట్స్ చేసిన శరీరకృతిలో పెద్దగా మార్పు కనిపించదు. అలాంటి వారు తినే ఆహారం విషయంలో శ్రద్ద తీసుకొని ప్రాపర్ వర్కౌట్స్ చేస్తే కండలు పెరుగుతాయి. ఆకర్షణీయమైన శరీరాకృతి సొంతం అవుతుంది. కాబట్టి కండలు పెరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవలో చూద్దాం !

కండలు వేగంగా పెరగాలని చాలమంది జంక్ ఫుడ్స్, చక్కెర పదార్థాలు, పిండి పదార్థాలు తింటూ ఉంటారు. వీటిని తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ శాతం పెరుగుతుంది తప్పా.. కండబలం పెరగదు. కాబట్టి తినే ఆహారంలో ప్యూర్ పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా కండలు పెరగాలంటే ప్రోటీన్లు అధికంగా కావాల్సి ఉంటుంది. పాలు, చికెన్, గుడ్లు, చేపలు, పాల కూర, నాట్స్.. వంటి వాటిలో ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి తినే ఆహారంలో ఇవి కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. చికెన్ లో దాదాపు అన్నీ రకాల ప్రోటీన్లు శరీరానికి అందుతాయి. అందువల్ల కండలు వేగంగా పెరగడంతో పాటు ఎముకలు కూడా బలపడతాయి. కాబట్టి చికెన్ అలవాటు లేని వాళ్ళు కండలు పెంచాలంటే కచ్చితంగా చికెన్ ను అలవాటు చేసుకోవాల్సిందే. గుడ్డు, పాలను కూడా ప్రోటీన్ సమ్మేళనాలుగా చెప్పుకోవచ్చు.

జిమ్ కు వెళ్ళే ముందు ఒక గ్లాస్ పాలు గుడ్డు సేవించి వెళితే.. కండపుష్టి జరుగుతుంది. గుడ్డులో విటమిన్ డి తో పాటు అమినో యాసిడ్స్, మంచి కొవ్వు కలిగిన రిచీ ప్రోటీన్స్ లభిస్తాయి అందువల్ల కండలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా తినే భోజనంలో పాలకూర ఉండేలా చూసుకోవాలి. పాల కూరలో ప్రోటీన్స్ తో పాటు, కాల్షియం, ఐరన్, జింక్, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకల పాటుత్వాన్ని పెంచడంతో పాటు కండబలాన్ని కూడా కలుగజేస్తాయి. ఇక. కండలు పెంచాలి అనుకునే వారు సాధారణంగా తినే ఆహారం కంటే 10 శాతం ఆహారం ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. రైస్ కు బదులు బ్రౌన్ రైస్ తినే కండలు వేగంగా పెరిగే ఛాన్స్ ఉంటుందని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. ఇంకా వే ప్రోటీన్స్, కాట్టెజ్, చీజ్ వంటివి కూడా కండలు ఏప్రగడానికి ఉపయోగ పడే ఆహార పదార్థాలే. కాబట్టి కండలు పెంచాలనే కోరిక ఉన్నవాళ్ళు తప్పనిసరిగా పై ఆహార పదార్థాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే మంచిదని ఫిట్ నెస్ నిపుణులు చెబుతున్నారు.

Also Read:సంక్రాంతి విజేత హనుమాన్

- Advertisement -